మేము గరిగాచీనేపల్లి నుండి అగస్త్యలో లెట్’స్ ఇన్వెస్టిగేట్ ల్యాబుకి వఛ్చి ఫోల్డ్స్కోప్ ని తీసుకుని అందులో ఒక స్లైడని తీసుకుని అందులో ఒక ఆకుని పెట్టి ఫోల్డ్స్కోపులో ని లైటుని ఆన్ చేసి చూసాము. అందులో మాకు ఆకులో ఉన్న పత్ర రంధ్రాలు చాలా స్పష్టంగా మరియు బాగా కనిపించాయి . మరియు తామరపువ్వు యొక్క ఖాండ కణాలను పరిశీలించాము . ఇందులో దాని ఖండాన్ని బ్లేడ్ తో చిన్న చిన్న ముక్కలుగా అడ్డకోత కోసాము . దానిని ఒక పెట్రిడిష్ లో నీరు పోసి సాఫ్రానైన్ రెండు చుక్కలు కలిపాము .అడ్డకోత కోసిన ముక్కలను దానిలో వేసాము . దానిని ఫ్లోడ్స్కోప్ లో లైట్ ఆన్ చేసి ఆ అడ్డకోత కోసినాముక్కలను స్లయిడ్ మీద పెట్టి చూసాము . అందులో అన్ని కణాలు బాగా కనిపించాయి .
జెడ్.పి.హెచ్ .ఎస్ .గరిగాచీనేపల్లి
జి.గణపతి, కే. నవీన్ కుమార్, జ్. అరుణ్ కుమార్